Samantha: విడిపోవడం, అనారోగ్యం.. అన్నీ బహిరంగంగానే ఎదుర్కొన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల తార సమంత ఎప్పుడూ తన నిజాయితీ, ధైర్యం, స్పష్టతతో అభిమానుల మనసులు గెలుచుకుంటూ వస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తూ, విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్ట్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Also Read : Surya : సూర్య – ఫహద్ ఫాజిల్ కాంబో ఫిక్స్..!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత, తన జీవితంలోని కష్టాలు, విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఎంతో ఓపెన్‌గా మాట్లాడింది. “నా జీవితంలో జరిగిన ప్రతి విషయమూ ప్రజల ముందు బహిరంగంగానే జరిగింది. అది విడిపోవడం కావచ్చు, అనారోగ్యం కావచ్చు. ఆ సమయాల్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నా. అయినా నా నిజమైన జీవితాన్ని దాచిపెట్టాలనుకోలేదు. నేనూ తప్పులు చేస్తాను, తడబడుతాను, కానీ మెరుగ్గా మారడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. జీవితాన్ని పరిపూర్ణంగా చూపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే గుర్తింపు అనేది అంతిమ గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం,” అని ఆమె చెప్పింది.
అలాగే నేటి యువతకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది.. “ఆశయాలు ఎన్ని ఉన్నా వాటికి సరైన ఉద్దేశం ఉండాలి. మన జీవితంలో మెంటార్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. అది మన భవిష్యత్తుని మార్చే నిర్ణయం అవుతుంది. అలాగే సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి” అని సూచించింది. చివరగా తన జీవితం గురించి మాట్లాడుతూ..“నేనొక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. మొదటి సినిమా తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. రాత్రికి రాత్రే స్టార్ అయ్యా. పేరు, కీర్తి, డబ్బు, చప్పట్లు అన్నీ వచ్చాయి. కానీ అవన్నీ నాకు ఓ పాఠం నేర్పించాయి నిజాయతీతో ఉన్నప్పుడే మనలో స్థిరత్వం వస్తుంది” అని చెప్పింది సమంత.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు