నాలుగు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన నవల ‘తులసిదళం’. ఆ నవలతో స్టార్ హీరోలకు ఎంతమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్. ఆ తర్వాత అదే కాదు, ఆయన రాసిన పలు నవలలు సినిమాలుగా రూపుదిద్దుకుని సూపర్ హిట్ అయ్యాయి. విశేషం ఏమంటే ఇప్పుడు యండమూరి కాన్సెప్ట్ పరంగా ‘తులసి దళం’కు సీక్వెల్ కథను రాశారు. దీని పేరు ‘తులసి తీర్థం’.
Read Also : రాజ్ కుంద్రాకు షాక్… మళ్ళీ పెరుగుతున్న కష్టాలు
ఇప్పటివరకు తన సొంత కథలతో మాత్రమే సినిమాలు తీస్తూ… నిత్యం వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ తన కెరీర్ లో మొదటిసారి, యండమూరి కథతో సినిమా రూపొందించేందుకు అంగీకరించారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ రేర్ కాంబినేషన్ ను సెట్ చేశారు. ‘తులసి తీర్థం’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గ్రాఫిక్స్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి!