RGV: పవన్ కళ్యాణ్ బిగ్ స్టార్.. నాకు అంత కెపాసిటీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆటిట్యూడ్ కి పర్మినెంట్ అడ్రస్ ఎవరు అంటే టక్కున ఆర్జీవి పేరు చెప్పుకొస్తారు అభిమానులు. నిత్యం ఒక్క వివాదం కూడా లేకపోతే అర్జీవికి ముద్ద దిగదు అనేది అభిమానుల అభిప్రాయం. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న వర్మ.. ఇప్పుడు కొంతమంది బయోపిక్ లు తీసి వివాదాలను సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోపిక్స్ తీయడంలో వర్మ సిద్ధహస్తుడు. ఇక ఏపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ను తీస్తున్నట్లు ప్రకటించాడు. వ్యూహం అనే పేరుతో ఈ బయోపిక్ ను తెరకెక్కించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో వర్మ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.
తాజాగా వర్మ.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. రాజకీయపరంగా పవన్ పై ఎప్పుడు విమర్శలు గుప్పించే వర్మ.. సినిమాల పరంగా పవన్ అంటే ఇష్టమని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు చాలా స్టార్ డమ్ ఉందని చెప్పుకొచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్.. పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే ఉద్దేశ్యం ఉందా.. ? అన్న ప్రశ్నకు వర్మ మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టార్ డమ్ కు.. నా టైప్ ఆఫ్ సినిమాకు సెట్ ఎవ్వడు. నేనెప్పుడూ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్, జోనర్ ఫిల్మ్స్ చేస్తాను. పవన్ కళ్యాణ్ చాలా పెద్ద స్టార్.. ఆయనకు ఉన్న ఇమేజ్.. తన ఫ్యాన్స్ కు తన నుంచి అంచనాలు ఉంటాయి. అలాంటి కెపాసిటీ లేదు నా దగ్గర డైరెక్టర్ గా. నేను చేయడం కాదు.. అసలు నేను చేయలేను. ఆయన ఇమేజ్ కు తగ్గ కథను క్రియేట్ చేసే కెపాసిటీ నాకు లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
- Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
- Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!