RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు. ఇక ఈసారి వ్యూహంతో వచ్చాడు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ లో చూపించినా సినిమా మాత్రం అంతగా లేదని టాక్. ఇక వ్యూహం ఎన్ని వివాదాల మధ్య నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీనికి పార్ట్ 2 గా శపథం రిలీజ్ అవుతుందని వర్మ ముందే ప్రకటించాడు. అయితే ఈ సినిమా.. థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటిటీలో రిలీజ్ కానున్నట్లు తెలిపారు. తాజాగా వర్మ ప్రెస్ మీట్ పెట్టి మరీ శపథం గురించి మాట్లాడాడు.
“శపథం సినిమా రెండు మూడు రోజుల్లో అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఏపీ లో ఫైబర్ నెట్ లో రిలీజ్ అయ్యింది. వ్యూహం, శపథం షూటింగ్ అప్పుడే మూవీ తో పాటు వెబ్ సిరీస్ లాగా చేసాము. అందరికీ సినిమా రిచ్ అవ్వాలనే మా ప్రయత్నం. నాలుగు గోడల మధ్య జరిగినది ప్రజలకు ఈ సినిమాలో చూపించాను. నాకు పబ్లిక్ ఫిగర్స్ మీద ఉన్న అభిప్రాయాన్ని నేను తీశాను” అని చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ..” టీడీపీ వాళ్లు సినిమా ని ఎవ్వరు చూడకుండా చేసేందుకు ఊర్లలో కేబుల్ కట్ చేస్తున్నారు. దానిపై పోలీస్ లు విచారణ చేస్తున్నారు. శపథం సినిమా ఇంకా సెన్సార్ అవ్వలేదు అందరూ సినిమా చూడాలని పర్పస్ తో సినిమా తీశాం అందుకే సెన్సార్ అవ్వకపోయినా ఫైబర్ నెట్ ఓటిటి లో రిలీజ్ అవుతుంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది” అని తెలిపాడు. మరి ఈ సినిమా ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.