RGV Says Barrelakka is Better than Pawan kalyan: ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పంథా మార్చి వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు టార్గెట్ గా వ్యూహం, శపదం అనే రెండు సినిమాలు చేసిన వర్మ వ్యూహం సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి మాత్రమే ఏమాత్రం వెనుకాడడం లేదు. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపికి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పలుచోట్ల జనసేన అభ్యర్థులను సైతం బరిలోకి దింపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ బిజెపి – జనసేన కూటమికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్న రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఇంతకంటే దారుణమైన, అసలు ఏమాత్రం ఆసక్తి లేని, అజాగ్రత్తతో కూడిన ప్రచారాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు.
Lavanya Tripati : పెళ్లి తర్వాత మెగా కోడలు ఇలా అయ్యిందేంటబ్బా.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిందే..
పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నాడు, అతను మాట్లాడుతున్న మైక్ సౌండ్ గురించి అతను పట్టించుకోవడం లేదు సరి కదా నిర్వాహకులు కూడా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ తో పోలిస్తే బర్రెలక్క చాలా బెటర్ గా ప్రచారం చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ గురించి రాంగోపాల్ వర్మ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ అని రాంగోపాల్ వర్మ కామెంట్ చేయడంతో పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మ మీద విరుచుకుపడుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ గత ప్రచారాల వీడియోలు చూస్తుంటే ఆయన ప్రచారానికి రావడం ఆర్గనైజర్లకు ఏమాత్రం ఇష్టం లేదేమో అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. ఇక బర్రెలక్కగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కర్నె శిరీష తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ అనే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. తాను చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకపోవడంతో తన తల్లి కొనిచ్చిన బర్రెలు కాస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. అయితే అదే వీడియో ఆమె మీద కేసు నమోదు అయ్యేలా కూడా చేసింది. అయితే ఆమె బరిలోకి దిగడంతో ఆమెకి ఇప్పుడు అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది.