వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ ఎవరు అంటే టక్కున రామ్ గోపాల్ వర్మ అని చెప్పేస్తారు. కాంట్రవర్సీ లేనిదే వర్మకు ముద్ద దిగదు అబితే అతిశయోక్తి కాదు. ఇక వివాదాలు ఏమి లేవు అంటే హీరోయిన్లనుఆకాశానికి ఎత్తేసి.. వారిని ఓవర్ నైట్ స్టార్లను చేసేస్తాడు. ఇది వర్మకు మాత్రమే తెలిసిన టాలెంట్. ఇలా వర్మ చేతిలో నుంచు జాలువారిన ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. అమ్మాయిలతో డాన్స్ లు, మితిమీరి అమ్మాయిల్లను తాకడం లాంటివి చేస్తూ వర్మ నిత్యం నెటిజన్ల ట్రోల్స్ కు గురవుతూనే ఉంటాడు. ఇక తాజాగా మరో ఆకతాయి పని చేసి నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాడు. వర్మ పరిచయం చేసిన ఆణిముత్యాల్లో అప్సర రాణి ఒకరు. వర్మ దర్శకత్వంలో ఆమె రెండు సినిమాలు చేసింది. ఇక వర్మ కంపెనీ నుంచి వచ్చిన ఈ భామ ‘క్రాక్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు.
బికినీ లో రచ్చ చేసి కురాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న అప్సర ఇటీవల బికినీలో రచ్చ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలను వర్మ షేర్ చేస్తూ వింత వింత ప్రశ్నలను అభిమానులను అడుగుతూ వచ్చాడు. “అప్సర రాణి బాడీ లో మీకు నచ్చని పార్ట్ ఏదో పోస్ట్ చేయండి” అంటూ ఆమె ఇన్నర్ తో ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీఛీ.. వర్మ ఇంత దిగజారతాడు అనుకోలేదు..?.. చివరికి ఇలాంటి చిల్లర పోస్టులను పెడుతున్నాడు అని కొందరు.. ఎలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్.. ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు ఏంటీ..? అని మరికొందరు కామెంట్స్ పెడుతుండగా.. ఇంకొందరు ఎలా ఉన్నా నీకు కంఫర్ట్ యేగా అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.