సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న అనగా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సూర్యకు దర్శకుడ్ కార్తీక్ సుబ్బరాజ్ మాస్ ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన రెట్రో ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా ఉందొ చూద్దాం రండి.
Also Read : NTR : ‘వార్ 2’ తెలుగు రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
రెట్రో ఒక యాక్షన్ చిత్రం, సూర్య విభిన్నమైన మేకోవర్‌లతో ఆకట్టుకుంటాడు. యాక్షన్ సన్నివేశాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి మరియు పూజాహెగ్డే తన పర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. 15 నిమిషాల లాంగ్ షాట్ వేరే లెవల్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్, కొన్ని అద్భుతమైన విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ గా అక్కడక్కడా కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ కూడా కాస్త సాగదీసి ఊహించదగినదిగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సో సో గా సాగింది. అలాగే మూడు గంటల రన్ టైమ్ కూడా ఇబ్బంది పెట్టె అంశమే. కామెడి అంతంత మాత్రేమే. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ నుండి ఆడియెన్స్ కోరుకునే సినిమా అయితే ఇది కాదు అని అయితే చెప్పొచ్చు. ఓవరాల్ గా సూర్య గత సినిమాల కంటే రెట్రో చాలా బెటర్ సినిమా. సూర్య నటనను ఇష్టపడే వారికి రెట్రో ఒక రేంజ్ ఫీల్ ఉంటుంది. మిగిలిన ఆడియెన్స్ కు జస్ట్ ఓకే సినిమా .