Reshma Pasupuleti: తమిళ్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రేష్మ పసుపులేటి. తమిళ్ లో సెటిల్ అయిన తెలుగమ్మాయి రేష్మ. ఒక పక్క సీరియల్స్, మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది తన కెరీర్ లో చాలా కష్టాలను ఎదుర్కొందట. ఇక తన కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయిన సుచీ లీక్స్ గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది. సుచీ లీక్స్ అప్పట్లో సంచలనం సృష్టించిన ఘటన. స్టార్ హీరో, హీరోయిన్ల మీద పగబట్టిన సింగర్ సుచిత్ర వారి ప్రైవేట్ వీడియోలను, ఫోటోలను సుచీ లీక్స్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి రిలీజ్ చేసింది. హీరో ధనుష్ దగ్గర నుంచి చిన్నా చితకా హీరోయిన్ల వరకు అందులో ఇరుక్కున్నారు.
ఇక ఈ సుచీ లీక్స్ లో రేష్మ పసుపులేటి కూడా ఉంది. అయితే ఆమె వీడియో మరీ ఘోరంగా ఉంది. ఎవరో ఒకతనితో బెడ్ షేర్ చేసుకకుంటూ, ఫోటోలు దిగుతున్నట్లు కనిపించింది. ఆ వీడియో రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోన్నే సంచలనంగా మారింది. ఇక ఆ వీడియో రిలీజ్ అయ్యాక రేష్మ పరువు పోవడమే కాకుండా అవకాశాలు కూడా రాలేదట. అన్నింటికి మించి తన కుటుంబం ఆ వీడియో చూసి ఏమనుకుంటుందో అని ఆమె భయపడిపోయిందట. ఈ విషయాన్నీ ఆమె ఇంటర్వ్యూలో చెప్తూ.. ” ఆరోజు వీడియో రిలీజ్ అయ్యాక మా చెల్లి నాకు ఫోన్ చేసి అక్కా.. నీ వీడియో అంటూ ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు అని చెప్పేసరికి షాక్ అయ్యాను. నా ఫ్యామిలీ మొత్తం నా గురించి ఏమనుకుంటారు అని ఎంతో బాధపడ్డా.. తట్టుకోలేకపోయా.. అందులో ఉన్నది నేను కాదు.. నా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. అసలు ఆ సమయంలో నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఇప్పటికీ నేను సింగిల్ గానే ఉన్నాను. నా వీడియోలను క్రియేట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ” రేష్మ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రేష్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.