Renu Desai : రేణూ దేశాయ్ సంచలన ప్రటకన చేసింది. తాను భవిష్యత్ లో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. రవితేజతో తాను నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టైమ్ లో కొన్ని రూమర్లు వచ్చాయని తెలిపింది. రేణూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది ఇక నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తుంది. అన్నింట్లోనూ ఆమెనే కనిపిస్తుంది అన్నారు. కానీ ఆ మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు నేను మళ్లీ సినిమాలో కనిపించలేదు.
Read Also : Naresh : నిర్మాతలు డబ్బులిస్తే సరిపోదు.. గౌరవం ఇవ్వాలి
అప్పుడు అలా అన్న వారంతా నాకు ఇప్పుడు సారీ చెప్పలేదు. నేను డబ్బుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. కానీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతాను. నేను ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. భవిష్యత్ లో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది అంటూ తెలిపింది రేణూ దేశాయ్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. రేణూ సన్యాసం తీసుకోవడం ఏంటని ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తన పిల్లలు పెద్దయ్యాక రెండో పెళ్లి చేసుకుంటాను అని గతంలోనే చెప్పింది ఈమె. ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేయడంతో ఫ్యాన్స్ అయోమయం అవుతున్నారు.
Read Also : Allu Shireesh : శిరీష్ కు కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన స్నేహారెడ్డి..