Renu Desai : పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న రెండు రూమర్లు కూడా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారనేది. అలాగే రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందనేది. ఈ రెండింటిపై తాజాగా రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘అవన్నీ వాస్తవాలు కాదు. ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాను. అకీరాకు తనంతట తాను సినిమాల్లోకి రావాలని ఉందని చెబితే.. స్వయంగా నేనే నా ఇన్ స్టా ద్వారా ఆ విషయం అందరికీ చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి రూమర్లు ఆపేయాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ తెలిపింది.
Read Also : Nagavamsi : వైష్ణవిని తర్వాత సినిమాలో ‘రా’గా చూపిస్తాం : నాగవంశీ
‘నా కొడుకును బిగ్ స్క్రీన్ పై చూడాలని అందరికంటే ఎక్కువగా నాకే ఉంది. నేను సినిమాల్లో నటించాను. వాళ్ల నాన్న పెద్ద హీరో. వాళ్ల ఫ్యామిలీ మొత్తం యాక్టింగ్ లోనే ఉన్నారు. కాబట్టి అకీరా కూడా పెద్ద హీరోగా ఎదిగితే చూడాలని నాకు ఎంతగానో ఉంది. కానీ నేను ఎప్పుడూ ఫోర్స్ చేయను. వాడికి ఏది చేయాలనిపిస్తే అదే చేయమని చెబతాను. యాక్టింగ్ అయినా లేదంటే ఇంకేదైనా సరే. ఏ పని చేసినా నాకేం బాధలేదు. కానీ తప్పుడు పనులు చేయకుండా ఉండాలి. అదే నేను కోరుకుంటాను. ప్రస్తుతం అతను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నేనే చెబుతాను. అప్పటి వరకు యూట్యూబ్ లో తంబ్ నైల్స్ పెట్టడం ఆపేయండి’ అంటూ కోరింది.