జైలర్ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టి ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. హెవీ ఫుట్ ఫాల్స్, హౌజ్ ఫుల్స్ బోర్డ్స్ అన్ని సెంటర్స్ లో ఉండడంతో జైలర్ సినిమా ఈ దశాబ్దంలో కోలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడానికి నెల్సన్ డైరెక్షన్, శివన్న-మోహన్ లాల్ క్యామియో, రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ముఖ్యమైన కారణాల్లో… అంతకన్నా ముఖ్యమైన ఫ్యాక్టర్ అనిరుధ్ మ్యూజిక్. రజినీకాంత్ సినిమా అనగానే ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చి అనిరుధ్, జైలర్ సినిమాని ముందుండి నడిపించాడు. రజినీకాంత్ కనపడితే చాలు హుకుమ్ సాంగ్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టిన అనిరుధ్, సీన్ కాస్త స్లో అవుతుందేమో అనిపించిన ప్రతిసారి రెడ్ బుల్ తాగినోడిలా మ్యూజిక్ కొట్టాడు. స్పెషల్ గా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ కి అనిరుధ్ కొట్టిన బీజీఎమ్ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇస్తుంది. జైలర్ అనే కాదు అనిరుధ్ ఏ సినిమా చేసిన ఇంపాక్ట్ ఇదే రేంజులో ఉంటుంది. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమాకి కూడా అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అనిరుధ్ అనే పేరు వినపడితే చాలు హిట్ హిట్ అనే నమ్మకంలోకి ఆడియన్స్ కూడా వచ్చేసి, తమ ఫేవరెట్ హీరోల సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కొడితే బాగుంటుందని కోరుకుంటున్నారు అంటే అనిరుధ్ ఏ ఫేజ్ లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి అనిరుధ్ మ్యూజిక్ జైలర్ సినిమాల్లో అన్ని సాంగ్స్ కన్నా ఒక సాంగ్ ఎక్కువ పేరు తెచ్చుకోవడం విశేషం. అయితే ఆ సాంగ్ ని అనిరుధ్ కాకుండా రెహమాన్ కంపోజ్ చేయడం విశేషం. జైలర్ సినిమాలో విలన్ ‘వర్మ’ క్యారెక్టర్ ఒక సీన్ లో ‘తాల్ సే తాల్’ సాంగ్ పెట్టుకోని డాన్స్ చేస్తూ ఉంటాడు. అతని గ్యాంగ్ తో పాటు వర్మ డాన్స్ చేస్తున్న ఈ సాంగ్ ‘తాల్’ సినిమాలోది. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమాకి రెహమాన్ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చాడు. తాల్ సినిమాలోని సాంగ్, ఇప్పుడు జైలర్ సినిమా కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ తాల్ సే తాల్ సాంగ్ పెట్టుకోని వైబ్ అవుతున్నారు. దీంతో రెహమాన్ అభిమానులు 1999లో కొట్టిన సాంగ్ ఈరోజుకీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే నువ్వు నిజంగానే సూపర్ అంటూ రెహమాన్ పై కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. అనిరుద్, రెహమాన్ లలో ఎవరు గొప్ప అనే డిబేట్ గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. సో ఈ డిబేట్ కాసేపు పక్కన పెడితే, ఎండ్ ఆఫ్ ది డే మ్యూజిక్ లవర్స్ కి కావాల్సింది ఒక మంచి సాంగ్. ఆ సాంగ్ వస్తే దాన్ని రిపీట్ మోడ్ లో వింటూ ఉంటారు. అలానే ఇప్పుడు ఈ సాంగ్ వైబ్ ఎన్నో రోజులు ఉంటుందో చూడాలి.