యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గురువారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో విడుదలైంది మొదలు, తారాజువ్వలా ట్రైలర్ వ్యూస్ గ్రాఫ్ ఏకాఏకి పైకి దూసుకుపోతోంది. మొదటి 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ వ్యూస్ ను ఇది దక్కించుకుంది. ఆల్ ఇండియా లెవల్ లో ఇది సరికొత్త రికార్డ్. మరే సినిమా కూడా ఈ నంబర్ కు దరిదాపుల్లో లేదు. అంతే కాదు… మొత్తం 1.5 మిలియన్ లైక్స్ ను ఈ ట్రైలర్ పొందింది. మరో ఇన్ ట్రస్టింగ్ థింగ్ ఏమంటే… ‘రాధేశ్యామ్’ తెలుగు ట్రైలర్ ను మించి హిందీ ట్రైలర్ కు రెస్పాన్స్ వస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీపై ఉత్తరాది సినిమా అభిమానులకు ఎంత క్రేజ్ ఉందో ఈ వ్యూస్ చెప్పకనే చెబుతున్నాయి. ఇంతకూ ‘రాధేశ్యామ్’ ట్రైలర్ కు ఇంత రెస్పాన్స్ రావడానికి రీజన్ ఏమిటని విశ్లేషిస్తే… చాలా కారణాలే కనిపిస్తున్నాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కు ఇప్పుడు 42 యేళ్ళు. డైరెక్ట్ గా అతన్ని గానీ, ఇన్ డైరెక్టర్ గా అతని పెదనాన్న కృష్ణంరాజుని కానీ కలిసే వ్యక్తులు అడిగే మొదటి ప్రశ్న ప్రభాస్ పెళ్ళి గురించే. కొంతకాలం వరకూ ఈ ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పిన కృష్ణంరాజు, ఇప్పుడీ ప్రశ్న ఎవరైనా వేస్తే చాలా చికాకు పడిపోతున్నారు. అయినప్పుడు అవుతుంది! అనే వేదాంత ధోరణితో సమాధానం చెబుతున్నారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ కంటే ముందు ప్రభాస్ మాట్లాడింది ప్రేమ, పెళ్లి గురించే కావడం విశేషం.
‘రేయ్… అమ్మ… నా పెళ్ళి గురించి అడిగితే చెప్పు… నా చేతిలో ప్రేమా, పెళ్ళి లేవ’ని అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ప్యాన్స్ ను హుక్ చేసేసింది. ఇది ప్రభాస్ నిజజీవితానికి సంబంధించిన అభిప్రాయం కాదు కదా! అనే సందేహాన్ని వారిలో క్రియేట్ చేస్తోంది. ఆ తర్వాత ‘ఐ లవ్ యూ’ అంటూ ఓ బ్యూటిఫుల్ లేడీ చెప్పిన మాటకు ‘సరసాలకు ఓకే కానీ ప్రేమకు నాట్ ఓకే’ అనే తరహాలో ప్రభాస్ బదులివ్వడంతో ‘ఎంతటి సరసుడివో తెలిసెరా!’ అనుకుంటారు అతనంటే పడిచచ్చిపోయే లేడీ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ప్రేరణ పరిచయం, ఆమెతో ప్రేమలో పడే సన్నివేశాలు, ఒక్క రోజులో పెట్టుకున్న 97 కిస్సుల కౌంటింగ్ తో ట్రైలర్ ఫుల్ రొమాంటిక్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో ‘విక్రమాదిత్య అనే వ్యక్తి పామిస్ట్రీలో ఐన్ స్టిన్ లాంటి వాడ’ని పరమహంస పాత్రధారి కృష్ణంరాజు ప్రవచించడంతో ఒక్కసారిగా మూవీ మీద అంచనాలు అంబరాన్ని తాకేస్తాయి. ‘నాతో ప్రేమలో పడితే చస్తావ్, నేను జూలియట్’ ను అని ప్రేరణ చెప్పడంలో ఏదో మర్మం ఉందని ఆడియెన్స్ కు అర్థమైపోతుంది. ఆమె ప్రేమను పొందడం కోసం విక్రమాదిత్య ప్రయత్నించినప్పుడల్లా ప్రకృతి విలయతాండవం చేయడం చూస్తే, ఇదేలో టైటానిక్ మూవీని మరిపించేలా ఉందనిపిస్తుంది. మొత్తంగా ప్రేరణ ప్రేమను పొందడానికి విక్రమాదిత్య చేసే యుద్థమే ‘రాధేశ్యామ్’ మూవీ అనిపిస్తోంది. ప్రాణం పోసిన ప్రేమ… ప్రాణాలు తీస్తుందా? విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? అనే ప్రశ్నలకు సిల్వర్ స్క్రీన్ మీదే సమాధానం దొరకుతుందనిపిస్తోంది.
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్, మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్… ఇవన్నీ ‘రాధే శ్యామ్’ను మరో రేంజ్ లో నిల్చోపెడతాయని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నిజానికి జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న ‘రాధేశ్యామ్’ ఏ లెవల్ లో ఐ ఫీస్ట్ గా ఉంటుందనేది ఈ ట్రైలర్ లో జస్ట్ శాంపిల్ గానే డైరెక్టర్ రాధాకృష్ణ చూపించాడు. సో… పిక్చర్ అభీ బాకీ హై!!