Raju Srivatsava: బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరిన విషయం విదితమే. జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. దాదాపు 15 రోజుల నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యిందని, చికిత్సకు ఆయన బాడీ సహకరిస్తుంది కానీ మెదడు మాత్రం పని చేయడంలేదని వైద్యులు తెలిపారు. ఇక దీంతో ఆయన కుటుంబ సభ్యులు, నటుడు సునీల్ పాల్ ఒక వీడియో ద్వారా అభిమానులందరూ ఆయన కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధించండి, మీ ప్రార్థనల వలన ఆయన కోలుకుంటాడు అని అభ్యర్ధించారు.
ఇక ఆ ప్రార్థనలు ఫలించి దాదాపు 15 రోజుల తరువాత రాజు శ్రీవాత్సవ స్పృహలోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆయన పీఆర్ వర్గం కన్ఫర్మ్ చేసింది. ఎంతో కష్టపడి వైద్యులు ఆయనను యధాస్థితికి తీసుకువచ్చారని తెలుస్తోంది. రాజు శ్రీవాత్సవ కళ్లు తెరవడంతో చికిత్స అందించడం ఈజీ అవుతుందని. త్వరలోనేనా ఆయన కోలుకొని మాములు మనిషి అవుతారని వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.