హైదరాబాదీ బ్యూటీతో రవితేజ రొమాన్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో కొత్త మలుపును అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త కథాంశాలతో విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో నాలుగు చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ దూసుకెళ్తున్నారు. అందులో ‘ఖిలాడీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రవితేజ కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఆయన ఖాతాలో ఉన్న మరో చిత్రం “రావణాసుర”. ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్ వర్మ, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రత్యేకమైన కథతో రాబోతోంది. కొన్ని రోజుల క్రితం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఆసక్తిని రేకెత్తించింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… తాజాగా “రావణాసుర” సినిమాలో కన్పించబోయే హీరోయిన్ గురించి కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం హైదరాబాద్ అమ్మాయితో రవితేజ “రావణాసుర”లో రొమాన్స్ చేయబోతున్నాడట.
ఈ చిత్రంలో కథానాయికగా ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించబోతోంది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ‘జాతి రత్నాలు’తో ఫస్ట్ హిట్ అందుకున్న ఫరియా కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండిపోయింది. కానీ ఇటీవల కాలంలో ఆమెకు ఆఫర్లు పెరిగినట్టుగా కన్పిస్తోంది. కాగా “రావణాసుర” చిత్రాన్ని ఆర్‌టి టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లపై రవితేజ, అభిషేక్ నామా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
తాజావార్తలు
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!