మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో వంద కోట్ల మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి 2023ని వాల్తేరు వీరయ్య సినిమాతో గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. హిట్ తో ఇయర్ ని స్టార్ట్ చేసిన రవితేజ రణవణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో కాస్త నిరాశపరిచాడు. 2023లో స్టార్ట్ అయిన ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేయడానికి 2024 సంక్రాంతికి ఈగల్ గా దిగుతున్నాడు రవితేజ. యాక్షన్ మోడ్ లో తెరకెక్కిన ఈగల్ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కుతాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పైగా రవితేజ సంక్రాంతి ట్రాక్ రికార్డ్ కూడా చాలా బాగుంది. ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్, క్రాక్, వాల్తేరు వీరయ్య… ఈ సినిమాలతో గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఆరు సార్లు సంక్రాంతికి బరిలో నిలబడ్డాడు మాస్ మహా రాజా రవితేజ… ఆరులో నాలుగు సాలిడ్ హిట్స్ కొట్టాడు రవితేజ. సంక్రాంతి సీజన్ రవితేజకి బాగా కలిసొచ్చింది కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈగల్ మూవీకి సంక్రాంతికి సాలిడ్ హిట్ అయ్యే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈగల్ సినిమాని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈగల్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.
ఈగల్ మూవీ నుంచి ట్రైలర్ అనౌన్స్మెంట్ పై అప్డేట్ బయటకి రానుంది. ఈ ట్రైలర్ తో అంచనాలు పెంచి జనవరి 13న హిట్ కొట్టాలనేది మేకర్స్ ప్లాన్. అయితే ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఈగల్ సినిమా వాయిదా పడుతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవి మరీ ఎక్కువవుతూ ఉండడంతో మేకర్స్ రెస్పాండ్ అవుతూ… ఈగల్ వస్తుందని తేల్చి చెప్తూ ట్వీట్ చేసారు. ఈగల్ ఆన్ జాన్ 13 అంటూ ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్వీట్ చేయడంతో, రవితేజ ఫ్యాన్స్ ఇదే ట్యాగ్ ని ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈగల్ సినిమా రిలీజ్ అయ్యే ఒక్క రోజు ముందే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఈగల్ సినిమా వచ్చే రోజే వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా రిలీజ్ కానుంది. నాగార్జున నా సామిరంగ మూవీకి కూడా సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేస్తుంది. ఎన్ని సినిమాలు ఉన్నా తగ్గేదే లేదు అంటూ ఈగల్ మూవీ బాక్సాఫీస్ బరిలో నిలుస్తుంది.మరి జనవరి 13న ఈగల్ సినిమా రవితేజ కెరీర్ లో ఎలాంటి మైల్ స్టోన్ సెట్ చేస్తుందో చూడాలి.
13.01.2024#EAGLE #EAGLEonJan13th pic.twitter.com/D4B6p6LSts
— People Media Factory (@peoplemediafcy) December 13, 2023