Maremma : స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తున్న మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు మాధవ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ లుక్ లో మెరిశాడు. ఇక గ్లింప్స్ లో అతను లుంగీ కట్టుకుని, బనీన్ వేసుకుని కనిపిస్తున్నాడు. కబడ్డీ గేమ్ లో కూతకు వెళ్తున్న సీన్ ను చూపించారు. ఇందులో ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసినట్టు కనిపిస్తోంది.
Read Also : Deepika Padukone : మగాడిలా ఉన్నావన్నారు.. దీపిక ఎమోషనల్..
ఆయన గతంలోనే మిస్టర్ ఇడియట్ సినిమాలో నటించాడు. ఈ మారెమ్మ సినిమా బ్యాక్ డ్రాప్ కొంత సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. బీజీఎం కూడా కొంత ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. విజువల్స్ కూడా అనుభవం ఉన్న టెక్నీషియన్లు తీసినట్టే ఉన్నాయి. హీరో మొదటి సినిమానే కంటెంట్ ఉన్నది ఎంచుకోవాలని డిసైడ్ అయినట్టు ఉన్నాడు. రొటీన్ లవ్ స్టోరీలు చేయకుండా.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా కథ, నేపథ్యం అన్నీ గ్రామీణ నేపథ్యంలోనే సాగేలా ఉన్నాయి. హీరో కూడా పల్లెటూరి కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు. మరి రవితేజ వారసత్వాన్ని కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.
Read Also : Mirai : వాయిస్ ఓవర్ తోనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్..