Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja’s 100 Crore Movies List: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నాన్-ఫెస్టివల్ సీజన్లో విడుదలైనప్పటికీ.. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన దక్కుతోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అతి తక్కువ సమయంలోనే ఈ మార్క్‌ను చేరుకోవడం అటు రవితేజ, ఇటు ఇరుముడి మూవీకి ప్రత్యేక రికార్డుగా మారింది.
ప్రాంతీయ మార్కెట్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ ఇరుముడి మంచి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. రవితేజకు ఉన్న క్రేజ్ అంతర్జాతీయ మార్కెట్లోనూ బలంగా ఉందని ఈ వసూళ్లు మరోసారి నిరూపిస్తున్నాయి. 2026లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక ఫస్ట్ మండే బుకింగ్స్ సాధించిన సినిమాగా ఇరుముడి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సాధారణంగా వీకెండ్ తర్వాత సోమవారం సినిమాల బుకింగ్స్, ఆక్యుపెన్సీ తగ్గుతుంటాయి. అయితే ఇరుముడి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సోమవారం కూడా బుకింగ్స్ భారీగా నమోదు కావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
ఇరుముడి విజయంతో రవితేజ ఖాతాలో మరో రూ.100 కోట్ల సినిమా చేరినట్టైంది. ఇంతకుముందు ‘ధమాకా’ ద్వారా మాస్ మహారాజా తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా భారీ వసూళ్లను (రూ.215 కోట్ల నుంచి రూ.236 కోట్ల గ్రాస్) సాధించింది. ఇప్పుడు ఇరుముడి కూడా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటడంతో.. రవితేజకు ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. కొంతకాలంగా సరైన బాక్సాఫీస్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి మంచి కంబ్యాక్‌ను అందించింది. సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్లు నిలకడగా ఉండటంతో.. లాంగ్ రన్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరుముడి వసూళ్ల జోరు కొనసాగుతుండటంతో.. మాస్ మహారాజా సహా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!