మాస్ మహారాజా రవితేజ జోరు పెంచాడు. క్రాక్ చిత్రం హిట్ తో ట్రాక్ మీదకు వచ్చిన ఈ హీరో వరుస సినిమాలను లైన్లో పెట్టి, వారికి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’ తరువాత రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. ఈ రెండు సెట్స్ మీద ఉండగానే ‘ధమాకా’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. ఇక వీటితో పాటు మరో సినిమాను కూడా రవితేజ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. రవితేజ 70వ సినిమా అనౌన్స్మెంట్ ని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.
‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే పోస్టర్ తో ప్రేక్షకులకు భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం.. ఈ చిత్రానికి ‘రావణాసుర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 5వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకి టైటిల్ పోస్టర్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. మరి పవర్ ఫుల్ టైటిల్ తో మాస్ మహారాజా మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నడేమో చూడాలి.