Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raveena Tandon: బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్‌కు ‘ఓహ్ మై డాగ్’ ఈవెంట్లో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా అందరూ చూస్తుండగానే ఆమెపై ఓ కుక్క ఒక్కసారిగా అటాక్ చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే రవీనా అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమానికి రవీనా టాండన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో భాగంగా ఉన్న సినిమా కుక్క ఆమెకు సమీపంలోకి వచ్చింది. అంతా నార్మల్‌గానే జరుగుతుందని అనుకుంటున్న సమయంలో ఆ కుక్క ఒక్కసారిగా రవీనా వైపు దూసుకొచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించింది.
కుక్క కరవడానికి ప్రయత్నించిన సమయంలో రవీనా ధరించిన దుస్తులకు సంబంధించిన ఓ దారం దాని నోటిలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. పరిస్థితిని వెంటనే గమనించిన ఆమె అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. దీంతో కుక్క దాడి నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కుక్క దాడి నుంచి తప్పించుకున్న అనంతరం ఆమె దానిని నార్మల్‌గా తీసుకున్నప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు రవీనా వేగంగా స్పందించడంతోనే పెను ప్రమాదం తప్పిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
Also Read
- DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
- Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
- Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
- Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
Vibrant Yellow Outfit-இல் அசத்தும் Raveena Tandon! 🔥💛 Spotted at Event with Pet Dog! 🐶🍿 👇 Daily Cinema & Celeb Spotting Updates-க்கு @KollyFlix-ஐ Follow பண்ணுங்க! 🔔 #RaveenaTandon #KollyFlix #Kollywood #CelebSpotted #BollywoodUpdates #TrendingReels pic.twitter.com/XGGeqxyvJX
— KollyFlix (@KollyFlix) August 8, 2026
తాజావార్తలు
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్‌కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!