Site icon NTV Telugu

Raveena Tandon: నా కూతురిలో ఆ నటి ఆత్మ.. స్టార్ హీరోయిన్ సంచలనం

Rasha Tadani

Rasha Tadani

జాన్వి విషయంలో శ్రీదేవి చేసిన తప్పు రవీనా ఠాండన్‌కు ఓ పాఠంగా మారింది. తన కూతురు రషా తడాని విషయంలో శ్రీదేవిలా ఆలోచించకుండా జాగ్రత్తపడింది రవీనా. టాలీవుడ్‌ ఆఫర్‌ రాగానే స్టారా? యంగ్‌ హీరోనా అని చూడకుండా ఓకె చేసేసింది. రవీనా టాండన్‌.. అనిల్‌ తడానీ కూతురు రషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఘట్టమనేని రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100.. మంగళవారం తీసిన అజయ్‌ భూపతి దర్శకుడు. ఇందులో రషా పోషిస్తున్న మంగ క్యారెక్టర్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేశారు. సినిమా ఆల్రెడీ 30 రోజులపాటు ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

Also Read :Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!

రషా తడానీ ‘అజాద్‌’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. సినిమా ఫ్లాప్‌ అయినా.. ఇందులోని స్పెషల్‌ సాంగ్‌లో రషా డ్యాన్స్‌కు..ఎక్స్‌ప్రెషన్స్‌కు యూత్‌ ఫిదా అయింది. సినిమా హిట్‌ కాకపోయినా.. రషా మాత్రం తక్కువ టైంలో ఇండియా వైడ్‌ పాపులర్‌ అయింది. 19 ఏళ్లకే కెరీర్‌ స్టార్ట్‌ చేసిన రషా.. మార్షల్‌ ఆర్టిస్ట్‌.. టైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ అయిన రషా యాక్టింగ్‌కు తల్లి రవీనా ఫిదా అయిపోయింది. కూతురు గురించి ఓ ఇంటర్వ్యూలో రవీనా మాట్లాడుతూ.. రషా మూడు నెలల వయసు నుంచే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌ పలికించిందని.. అద్దం ముందు నిలబడి ఏడుస్తున్నట్టుగా నటించేదని చెప్పుకొచ్చింది. చిన్న వయసులో అద్దం ముందు నుంచుని నటించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అర్థం అయ్యేది కాదు. ఎవరో గొప్ప నటి ఆత్మ రషాలో వుందేమోనని మదర్‌ అనేదంటూ కూతురి జ్ఞాపకాలను పంచుకుంది రవీనా.

Exit mobile version