నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే పుష్పతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక ఆసక్తికరమైన విషయాలతో పాటు తన చిలిపి కోరికను బయటపెట్టింది. ” ఈ సినిమా చాలా బావుంటుంది. ఫ్యామిలీతో కలిసి అందరు చేయండి.. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేశాక మహిళగా డ్రెస్సింగ్‌లో చాలా కష్టం అనిపించింది.
మరుజన్మలో నేను మగాడిగా పుట్టాలనుకుంటున్నాను. ఆడవారు అయితే అలంకరించుకోవాలి. మగాడి ముందు తలదించుకుని కూర్చోవాలి.. అదే మగాడిలా పుడితే ఇవేమి చేయాల్సినవసరం లేదు. ఇలా కాలు మీద కాలు వేసుకొని దిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే సరిపోతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక పేళ్ళి వార్తలపై స్పందిస్తూ ఇలాంటి లక్షణాలు ఉంటేనే పెళ్లి చేసుకుంటాను అనేది ఏమి లేదు.. మనసుకు నచ్చితే చేసేసుకుంటాను అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదెక్కడి చిలిపి కోరిక రష్మిక అని కొందరు.. మా మగాళ్ల ఇబ్బందులు మీకేం తెలుసు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.