Tollywood Heros: టాలీవుడ్ కొత్తతరం హీరోలు.. నటులే కాదు స్టోరీ సృష్టికర్తలు కూడా!
- ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్న కొత్తతరం హీరోలు
- ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలతో సినిమాలు
- మల్టీ టాలెంట్ హీరోల జాబితాలో ముందు వరుసలో అడివి శేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్తతరం హీరోలు సినిమాల్లో కేవలం నటనకే పరిమితం కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు. హీరోల మల్టీ టాలెంట్ కారణంగా ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, బలమైన పాత్రలతో కూడిన సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. మల్టీ టాలెంట్ హీరోల జాబితాలో అడివి శేష్ ముందు వరుసలో ఉన్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి విజయాల తర్వాత ప్రస్తుతం ‘డాకోయిట్’, ‘జీ2’ చిత్రాలకు రచయితగా, స్క్రీన్‌ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. కథా నిర్మాణంలో తనదైన ముద్ర వేసే శేష్.. టాలీవుడ్‌లో హీరో-రైటర్ కలయికకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు.
విశ్వక్ సేన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. తన రాబోయే కల్ట్ సినిమా కోసం కథ రాయడమే కాకుండా.. దర్శకత్వ బాధ్యతలు కూడా స్వయంగా చేపట్టడం విశేషం. కొత్తదనం, ధైర్యమైన ప్రయోగాలు విశ్వక్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. యువతకు బాగా కనెక్ట్ అయిన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ కొత్తతరం ట్రెండ్‌లో భాగమే. ‘టిల్లు’ సిరీస్‌తో సెన్సేషన్ సృష్టించిన సిద్ధు.. రాబోయే టిల్లు క్యూబ్ సినిమాకు రచయితగా, స్క్రీన్‌ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. హాస్యం, డైలాగ్ టైమింగ్‌లో అతని రచన అద్భుతంగా ఉంది.
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
Also Read: IND vs NZ T20 Records: మూడేళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. టీ20 రికార్డులు ఇవే!
తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నవీన్ పోలిశెట్టి కూడా కథా రచనలో ముందడుగు వేశారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లే బాధ్యతలు మోశారు. మొత్తానికి టాలీవుడ్‌లో ఈ కొత్తతరం హీరోలు కేవలం తెరపై కనిపించే ముఖాలు మాత్రమే కాదు.. కథను సృష్టించే మైండ్, సినిమాకు దిశ చూపించే సృజనాత్మక శక్తులుగా మారుతున్నారు. ఈ మార్పు పరిశ్రమకు కొత్త ఊపును ఇచ్చి, ప్రేక్షకులకు మరింత నాణ్యమైన సినిమాలను అందిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!