సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోలింగ్ తప్పడం లేదు.. వారు ఏ చిన్న పొరపారు చేసి దొరికిపోయినా నెటిజన్లు ట్రోల్స్ తో ఏకిపారేస్తారు. ఇక హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ .. తాజాగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నాను ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు.. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా ప్రమోషనల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఆ ఇంటర్వ్యూ చూసిన ఒక నెటిజన్ “అసలు దీన్ని హీరోయిన్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది.. దీని ఓవర్ యాక్టింగ్” అంటూ ఘాటుగా స్పందించాడు.
ఈ కామెంట్ కి రష్మిక కూడా ఘాటుగానే స్పందిస్తూ ”యాక్టింగో, ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వు ఏం సాధించావు నాన్నా” అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది. సదురు నెటిజన్ కి గట్టి కౌంటర్ ఇచ్చావంటూ రష్మికను నెటిజన్స్ పొగిడేస్తున్నారు. ఇకపోతే మరో రెండు రోజుల్లో పుష్ప విడుదల కానుంది . మరి ఈ సినిమాతో అమ్మడు మరో హిట్ అని అందుకుంటదేమో చూడాలి.