Site icon NTV Telugu

Samantha – Rashmika : ఫ్యాన్స్ తో ఆటలాడుతున్న రష్మిక, సమంత.. ఎందుకిలా..?

Sam

Sam

Samantha – Rashmika : సమంత రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. కానీ ఆమె దానిపై పెద్దగా స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. ఏదైనా ఉంటే చెప్పేయమని అంటున్నారు. కానీ సమంత నుంచి నో రెస్పాన్స్. కానీ రాజ్ నిడుమోరుతో తరచూకలిసి తిరుగుతోంది. చాలా క్లోజ్డ్ గా ఉన్న ఫొటోలను పోస్టులు చేస్తోంది. అతన్ని గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోను కూడా నిన్న వదిలింది. కానీ రిలేషన్ గురించి మాత్రం బయట పెట్టట్లేదు. ఫ్యాన్స్ అడుగుతున్నా తనకు లెక్కలేదన్నట్టే బిహేవ్ చేస్తోంది.

Read Also : JR NTR : ఎన్టీఆర్ కు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్ ఆమెనే..

ఇటు రష్మిక కూడా అంతే. విజయ్ దేవరకొండతో ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉంది. కానీ బయట పెట్టలేదు. మొన్న వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ అడిగితే అసలు నిజం చెప్పకుండా.. మీరేం అనుకుంటే అదే నిజం అంటోంది. అంటే ఫ్యాన్స్ అంటే మరీ అంత చులకనగా కనిపిస్తున్నారా వీరిద్దరికీ. ఆ ఫ్యాన్స్ వీళ్లు ఏం చేసినా సపోర్ట్ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఆ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ లేకుండా వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వీరిపై లేదా. మరీ ఇంత ఓవర్ ఎందుకు చేస్తున్నారు. ఏమీ లేకపోతే ఎందుకు కలిసి తిరుగుతున్నారు. ఏమీ లేకపోతే అదైనా చెప్పేయాలి కదా. ఇలా చేసి తమ ఫ్యాన్స్ ను వీళ్ల కోసం ఆరా తీయాలి అనుకోవడం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు.

Read Also : Anupama Parameshwaran : ఆమెపై కేసు పెట్టిన అనుపమ.. అలా చేస్తోందంట

Exit mobile version