Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక వరుసగా పాన్ ఇండియా హిట్లు అందుకుంటోంది. రీసెంట్ గానే కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్, తన పాత్రలపై ‘వి ద విమెన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ పాత్ర చేసినా సరే సిగరెట్ తాగే పాత్రలు మాత్రం అస్సలు చేయను. నేను వ్యక్తిగతంగా పొగతాగడానికి వ్యతిరేకం. అందుకే ఇప్పటి వరకు అలాంటి పాత్రల్లో నటించలేదు. సినిమాలో పాత్రల కోసం ఎవరైనా నన్ను సిగరెట్ తాగమని అడిగితే నేను అస్సలు చేయను. అవసరం అయితే సినిమా అయినా వదులుకుంటాను గానీ అలాంటి పాత్రలు చేయను.
read also : Tollywood : 9 హిట్లు.. 2025 హాఫ్ ఇయర్ విన్నర్ ఆ హీరోనే..!
నాకు ఎప్పటి నుంచో బలమైన నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయాలని ఉంది. అందుకే మైసా సినిమా చేస్తున్నాను. ఆ కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలని నేను రూల్ పెట్టుకోలేదు. నాకు నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తాను. అందుకే సీతారామం మూవీలో నటించాను అని చెప్పుకొచ్చంది రష్మిక. ఇక యానిమల్ సినిమా మీద వచ్చిన విమర్శలపై స్పందించింది. దాన్ని నేను ఒక సినిమాలాగానే చూస్తాను. ఒక మూవీని చూసి ఎవరైనా ఎఫెక్ట్ అవుతారంటే నేను నమ్మను. అలా అనిపిస్తే మీరు ఏ సినిమాలు చూసి చెడిపోరా దాన్నే చూడండి. పలానా సినిమాను చూడమని ఎవరూ బలవంతం చేయట్లేదు కదా’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది రష్మిక.
read also : Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్
