నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా క్రేజ్ ను అందుకుంటోంది రష్మిక మందన్న. ‘పుష్ప’తో శ్రీవల్లిగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో, భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తూ అన్ని భాషల సినీ ఇండస్ట్రీలలో సందడి చేసేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈ బ్యూటీ అభిమానులను తనవైపుకు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా ఈ బ్యూటీ విజయ్ పై చేసిన పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Also : Tollywood : ఈ వీకెండ్ లో ఏడు సినిమాలు!
“తలపతి 66” అనే వర్కింగ్ టైటిల్ తో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక “బీస్ట్”ను కంప్లీట్ చేసిన విజయ్ ఇప్పుడు “తలపతి 66″ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభమైన ఈ మూవీ పిక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే రష్మిక జోడి చాలా ఫ్రెష్ గా ఉందంటూ విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తుండగా, రష్మిక తాజాగా విజయ్ పై తనకున్న అభిమానాన్ని మొత్తం వెల్లడిస్తూ ఓ పోస్ట్ ను పంచుకుంది. అందులోనే విజయ్ తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అందులో విజయ్ పై ఆమెకున్న క్రష్ అంతా పదాల రూపంలో వెల్లడించింది. “సార్‌ని చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎట్టకేలకు ఆయనతో కలిసి నటిస్తాను, డ్యాన్స్ చేస్తాను, మాట్లాడతాను” అంటూ రష్మిక ట్వీట్ చేసింది.
Ok now this feels like something else… ❤️❤️ Been watching sir for years and years and now to do everything that I’ve been wanting to do.. act with him, dance with him, take his nazar, talk to him.. everything .. yaaaaay finally! 😄❤️ An absolute delight.. ❤️#talapathyvijay pic.twitter.com/SHtFfKryip
— Rashmika Mandanna (@iamRashmika) April 7, 2022