Rashmika Mandanna team denies rumors of extra pay for Lip Locks: కిరిక్ పార్టీతో కన్నడ నాట తనదైన ముద్ర వేసుకున్న రష్మిక మందన్న చలో సినిమాతో తెలుగులో కూడా సెటిల్ అయింది. ఇక ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా సెటిల్ అయిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా కన్నేసింది. ఇప్పటికే అక్కడ ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ ఎందుకో పూర్తిస్థాయిలో ఆమెకు ఉపయోగపడలేదు. ఈ క్రమంలో రష్మిక మందన్న తన తదుపరి చిత్రం యానిమల్‌తో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ అంతా విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల, యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ – రష్మిక మందన్న కలిసి నటించిన “ అమ్మాయి ” (తెలుగు వెర్షన్ పాట) పాట విడుదలైంది.
What the Fish: క్రేజీగా వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్.. వాట్ ది ఫిష్ మాస్టారూ?
అయితే ఈ పాట సోషల్ మీడియాలో అంతులేని చర్చకు దారితీసింది. ఈ పాటలో రణ్‌బీర్, రష్మిక మందన్నల మధ్య లిప్ కిస్‌లు ఒక రేంజ్ లు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఈ పాట గురించి అనేక వార్తలు కూడా తెర మీదకు వచ్చాయి. అందులో భాగంగా రష్మిక మందన్న ఈ లిప్ లాక్స్ కోసం అదనపు వేతనం డిమాండ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రష్మిక టీం తప్పుపట్టింది. ఇలా కొన్ని సీక్వెన్స్ ల కోసం రష్మిక మందన్న ఎప్పుడూ అదనపు పేమెంట్స్ అడగదని పేర్కొంది. కథ విన్నప్పుడే క్లారిటీ తీసుకుంటుందని ఒక వేళ షూట్ సమయంలో అలా ఏమైనా సీన్స్ చేయాల్సి వచ్చినా అవసరాన్ని బట్టి చేస్తుంది తప్ప అదనపు పేమెంట్స్ కోసం ఆమె డిమాండ్ చేయదని వెల్లడించారు.