Site icon NTV Telugu

Rashmika : ప్రభాస్ తో చేస్తే నా కెరీర్ ఎక్కడికో వెళ్తుంది.. రష్మిక కామెంట్

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి వస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఇందులో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. వరుస ప్రమోషన్లు చేస్తున్న రష్మిక తాజాగా.. తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు. మీరు ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారు.. ఒకవేళ మీరిద్దరూ నటిస్తే ఆ కాంబోతో వచ్చే హైప్ కు థియేటర్ కు నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

Read Also : Nagavamsi : వార్-2 దెబ్బకు షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగవంశీ

దీనికి రిప్లై ఇచ్చిన రష్మిక.. నాకు కూడా ప్రభాస్ తో యాక్ట్ చేయాలని ఉంది. ఆయన చాలా మంచి యాక్టర్. ఆయనతో నటిస్తే నా కెరీర్ వేరే స్థాయిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇదంతా ప్రభాస్ చూస్తాడని అనుకుంటున్నా అని రాసుకొచ్చింది. ఇంకేముంది ఆమె కామెంట్ ను ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. తమ హీరో రేంజ్ అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా.

Read Also : Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి మూవీ నుంచి కీలక అప్డేట్

Exit mobile version