Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ నే అందుకొంది. చిన్నతనం నుంచి విజయ్ తన ఫేవరేట్ హీరో అని, అతనితో కలిసి నటించడం అదృష్టమని చెప్పిన రష్మిక వరిసు విజయంతో మంచి జోష్ మీద ఉంది. ఇక మరోపక్క బాలీవుడ్ లో కూడా అమ్మడు పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సినిమా గుడ్ బై తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అది ఏ మాత్రం రష్మిక కు ఉపయోగపడలేదు. ఇక రష్మిక ఆశలన్నీ మిషన్ మజ్ను మీదనే పెట్టుకొంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల ఓటిటీలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది.
Allu Arjun: అత్తగారింట్లో పుష్ప రాజ్ సంక్రాంతి సంబరాలు
ఒక ఇంటర్వ్యూలో రష్మిక తన చేతిపై ఉన్న టాటూ గురించి చెప్పుకొచ్చింది. అసలు ఆ టాటూ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనేది వివరించింది. ” నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి.. అమ్మాయిలను కించపరుస్తూ మాట్లాడాడు. అమ్మాయిలు అన్నింటికి భయపడతారు. ముఖ్యంగా సూదులు పొడిస్తే అసలు ఏడుపు ఆపరు అని అన్నాడు. అతడికి ఎలాగైనా అమ్మాయిల పవర్ ఏంటో చూపించాలనుకున్నా.. వెంటనే చేతిపై టాటూ వేయించుకుందామని వెళ్ళాను. అయితే ఏం వేయించుకోవాలి అని ఆలోచించాను. ప్రపంచంలో ఏ మనిషి ఇంకొక మనిషితో రీప్లేస్ చేయలేరు. ఎవరి గుర్తింపు వారిది.. దాన్ని నేను నమ్ముతాను. అందుకే వెంటనే ఇర్రిప్లేసిబుల్(irreplaceble) అని వేయించుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ టాటూ సీక్రెట్ ను విని అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ అని కొందరు అంటుంటే.. టాటూ వెనుక ఇంత సీక్రెట్ ఉందా..? అని మరికొందరు నోళ్లు వెళ్లబెడుతున్నారు.