నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ… సోషల్ మీడియా ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. “@DCP_IFSOకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ్యులను పట్టుకున్నందుకు ధన్యవాదాలు. నన్ను ప్రేమతో, మద్దతుతో ఆదరించి, మీకు నాకు తోడుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు – మీ సమ్మతి లేకుండా ఎక్కడైనా మీ ఫోటోలను ఉపయోగించిన లేదా మార్ఫింగ్ చేసినట్లయితే అది చట్టారీత్యా నేరమని అన్నారు. ఇలాంటి వ్యవహారాలు మీకు మద్దతునిచ్చే వ్యక్తులతో ముడిపడి ఉంటుందని అన్నారు. అలాంటి వారిపై తప్పకుండా చర్య తీసుకోవాలని నేను కోరుతున్నానని తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్ ఆఫ్ స్పెషల్ సెల్, ఢిల్లీ పోలీసులు రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి ఈమని నవీన్ (24)ని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు. దీనిపై IFSO యూనిట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, హేమంత్ తివారీ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌గా గుర్తించబడిన ప్రధాన నిందితుడిని మేము అరెస్టు చేసాము. అతని నుండి ల్యాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాము. అతని తొలగించిన డేటాను కూడా రికవరీ చేస్తున్నారు. అతను ఒక ప్రముఖ సినీ నటి రష్మిక యొక్క ఫ్యాన్ పేజీనే కాకుండా.. మరో ఇద్దరు ప్రముఖ సెలబ్రిటీల కోసం మరో రెండు ఫ్యాన్ పేజీలను కూడా సృష్టించాడని తెలిపారు. ఇతను డీప్‌ఫేక్ వీడియోను సృష్టించి దానిని అక్టోబర్ 13. 2023న ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ డీప్‌ఫేక్ వీడియో కారణంగా అతని పేజీకి రెండు వారాల్లో అభిమానుల ఫాలోయింగ్ 90,000 నుండి 1,08,000కి పెరిగింది” అని పోలీసులు తెలిపారు. డిసిపి, ఐఎఫ్‌ఎస్‌ఓ యూనిట్, నిందితుడిని నిరంతర విచారణలో, నవీన్ బి టెక్ అభ్యసిస్తున్నప్పుడు పూర్తి చేసినట్లు వెల్లడించాడు.
Expressing my heartfelt gratitude to @DCP_IFSO 🙏🏼 Thank you for apprehending those responsible.
Feeling truly grateful for the community that embraces me with love, support and shields me. 🇮🇳
Girls and boys – if your image is used or morphed anywhere without your consent. It…
— Rashmika Mandanna (@iamRashmika) January 20, 2024