నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ… సోషల్ మీడియా ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. “@DCP_IFSOకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ్యులను పట్టుకున్నందుకు ధన్యవాదాలు. నన్ను ప్రేమతో, మద్దతుతో ఆదరించి, మీకు నాకు తోడుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు – మీ సమ్మతి లేకుండా ఎక్కడైనా మీ ఫోటోలను ఉపయోగించిన లేదా మార్ఫింగ్ చేసినట్లయితే…