Rashmika Mandanna: అదంతా పచ్చి అబద్ధమంటూ ‘కొండ’ బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు బారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో రశ్మికా మందణ్ణ ఒకరు. అనతికాలంలోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించుకోవడం, పాన్ ఇండియా నటిగా అవతరించడంతో.. మేకర్స్ ఈమె వెనకాలే పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐటెం సాంగ్ కోసం రశ్మికాను సంప్రదించినట్టు కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకున్నారు..? డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతోన్న ‘జన గణ మన’.
ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పూరీ, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్‌గా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మాస్ ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేకమైన ఐటెం సాంగ్ డిజైన్ చేశాడని, అందుకోసం రశ్మికాని రంగంలోకి దింపనున్నాడని ఈ న్యూస్ తెరమీదకొచ్చింది. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా.. ‘జన గణ మన’లో ఐటెం సాంగ్ చేసేందుకు రశ్మికా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. రశ్మికా ఒప్పుకోవడం కాదు కదా.. అసలు ‘జన గణ మన’లో ఐటెం సాంగే లేదని తెలిసింది.
Also Read
- Akhil Raj : 'ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?' అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
- Yash: 'టాక్సిక్' లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
- Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
- Ramayana : లాస్ ఏంజెల్స్‌లో 'రామాయణ' ట్రైలర్ లాంచ్
‘‘జన గణ మన ఓ పేట్రియాటిక్ సినిమా. ఇలాంటి సినిమాల్లో ‘ఐటెం సాంగ్’ ఎలా పెడతారు? ఆ వార్తల్లో నిజం లేదు. ఇదో పూర్తిస్థాయి దేశభక్తి సినిమా మాత్రమే’’ అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయాలని పూరీ అనుకున్నాడు. కానీ, ఎందుకో అది వీలు పడలేదు. చాలాకాలం నిరీక్షణ తర్వాత, ఇప్పుడు విజయ్‌తో రంగంలోకి దిగాడు పూరీ.
తాజావార్తలు
-
Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్