Rashmika : బాలీవుడ్ సీక్వెల్‌లో రష్మిక మందన్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు చక్రం తిప్పుతుంది. వరుస హిట్ అందుకుంటు ప్రజంట్ టాప్ పోజిషన్‌లో ఉంది. ముఖ్యంగా హిందిలో కూడా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ధూసుకుపోతుంది. గత ఏడాది ఛావా సినిమాతో హిందీ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం హారర్ కామెడీ ఎంటర్టైనర్ తమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో పెద్ద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read : Mirai : US బాక్సాఫీస్‌లో మిరాయ్ మ్యాజిక్.. భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న తేజ సజ్జ
Also Read
2012లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన కాక్‌టెయిల్ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. అసలు సినిమాలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించి, ప్రేమ–స్నేహం–అనుబంధాలపై ఆధారపడి వచ్చిన ఈ కథ యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ఫ్రాంచైజ్‌లో ‘కాక్‌టెయిల్ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. కాగా సమాచారం ప్రకారం రష్మిక ఈ సినిమాలో భాగమవుతున్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్న ప్పటికీ, అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. కానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయాన్ని ప్రకటించారు. ఆన్-లొకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ, “అపరిమితమైన వినోదానికి సిద్ధంగా ఉండండి” అంటూ క్యాప్షన్ జోడించారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కాక్‌టెయిల్ 2 ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీంతో బాలీవుడ్ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!