పాన్ ఇండియా హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక పేరు ముందు వరుసలో ఉంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ బ్యూటీ ఫాలో అవుతున్నట్లుంది. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. అందుకే రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ పెంచేసింది. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత రష్మిక నిర్మాతల నుంచి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని టాక్ నడుస్తోంది.
Read Also : Bheemla Nayak Success : పవన్ ఫుల్ ఖుషీ… టీంకు గ్రాండ్ పార్టీ
రష్మిక ‘పుష్ప’ రెండవ భాగానికి భారీ రెమ్యునరేషన్ కోరుకోవడమే కాకుండా, ఇతర మేకర్స్ నుండి కూడా అంతే డిమాండ్ చేస్తోందట. ముఖ్యంగా ఆమె తన రెమ్యూనరేషన్ తో నెక్స్ట్ మూవీ కోసం సంప్రదించిన మేకర్స్ కు షాక్ ఇచ్చిందట. గీతా ఆర్ట్స్ ఉమెన్ సెంట్రిక్ సినిమా చేయమని ఆమెను సంప్రదించినప్పుడు, రష్మిక భారీ రెమ్యునరేషన్ కోట్ చేసిందని టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో. “గీత గోవిందం”తో శ్రీవల్లికి పెద్ద బ్రేక్ ఇచ్చింది గీతా క్యాంప్. అయినప్పటికీ ఆమె తన రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అనడం హాట్ టాపిక్ గా మారింది. రష్మిక నిర్మాతల నుంచి జీఎస్టీతో పాటు రూ.2 కోట్లు అడిగినట్లు సమాచారం. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.