నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. గత ఏడాది రణబీర్ కపూర్ కు జోడిగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టేసింది.. ఇప్పుడు అదే జోష్ తో మరో బంఫర్ ఆఫర్ పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి..
తాజాగా రష్మికకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు సమాచారం.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు.. ఈ సినిమా లైన్ బాగుండటంతో ముందుగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు టీమ్ రెడీ అవుతున్నారు..
సల్మాన్ ఖాన్ కు జోడిగా రష్మిక మందన్నను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని యూనిట్ టాక్.. సౌత్ లో వచ్చినట్లు నార్త్ లో సినిమా ఆఫర్స్ రావడం కష్టం.. కానీ ఈ అమ్మడు లక్ వల్లే మరో ఆఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర అన్నీ హిందీలోనూ డబ్ కాబోతున్నాయి. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ VD14 సినిమాలో నటిస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..