Rashmi Gautham: నందు విజయ్‌కృష్ణ హీరోగా, రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను దర్శకుడు మారుతి, హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేశారు. అనంతం మారుతి మాట్లాడుతూ, ”ఈ సినిమా చూశాను చాలా బాగుంది. కచ్చితంగా ఆడియెన్స్ ఎంటర్ టైన్ అవుతారనిపించింది. వెంటనే దర్శకుడు విరాట్ ను పిలిచి నెక్స్ట్ మా బ్యానర్‌లో సినిమా చేయమని చెప్పాను. రష్మీ కూడా ఈ సినిమాతో మంచి హీరోయిన్ అవుతుంది. కంటెంట్ ను నమ్ముకొని సినిమా తీసిన నిర్మాతలకు మంచి మైలేజ్ వస్తుంది” అని అన్నారు. దర్శకుడు విరాట్ వచ్చే జనరేషన్ కు మూలవిరాట్ గా నిలబడాలని కోరుకుంటున్నట్టు మరో నిర్మాత ఎస్.కె.యన్. ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘డీజే టిల్లు పార్ట్ 2′ స్క్రిప్ట్ రాసే క్రమంలో బిజీగా ఉన్నా నందు, రష్మీ కోసం వచ్చాను. నేను, నందు, విశ్వక్, రష్మీ అందరం టెన్ ఇయర్స్ బ్యాక్ కలిసి కెరీర్ స్టార్ట్ చేశాం. అప్పుడు మేం చాలా ఇబ్బంది పడ్డాం. అలాగే రష్మి నా ఫస్ట్ కో స్టార్ కూడా. డైరెక్టర్ విరాట్ ఇంతకు షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఉంది. అవి అవార్డులూ గెలుచుకున్నాయి. అలాగే ఈ సినిమా కంటెంట్ లో చాలా క్రేజీనెస్ ఉంది’ అని అన్నారు.
Read Also: Bigg Boss 6: రేవంత్ పరువు తీసిన నాగార్జున.. పప్పూ అంటూ ఫైర్
చిత్ర నిర్మాతలో ఒకరైన బోసుబాబు మాట్లాడుతూ.. ‘వైజాగ్ దగ్గర చిన్న పల్లెటూరిలో ఈ సినిమా షూట్ చేశాం. ఆ గ్రామంలో ఏ ఫెసిలిటీస్ లేకున్నా కూడా నందు, రష్మీ, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎంతో సహకరించారు. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి ప్రధాన కారణం వారందరి సహకారమే. దర్శకుడు విరాట్ మేకింగ్ చాలా బాగుంది, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి మేము అనుకున్న దాని కంటే 100 రెట్లు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు’ అని అన్నారు. నందు మాట్లాడుతూ.. ‘ఏ బ్యాక్ గ్రౌండ్ లేని నాకు ‘సవారీ’ సినిమాకు ప్రేక్షకులందరూ బ్యాక్ గ్రౌండ్ గా నిలిచి, సపోర్ట్ చేశారు. అచ్యుతాపురం అనే చిన్న ఊర్లో షూట్ చేస్తున్నప్పుడు ఇల్లు కూడా లేని ఆ ఊర్లో రష్మిక పూరిగుడిసెలో డ్రెస్ చేంజ్ చేసుకునేది. సినిమా కోసం తను చాలా ఇబ్బంది పడింది. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు. ఈ సినిమాతో పాటు పాటలు చాలా బాగా వచ్చాయి’ అని చెప్పారు. రష్మిక గౌతమ్ మాట్లాడుతూ.. ‘రాజ్ విరాట్ చెప్పిన కథను నమ్మి, నందు వచ్చి నాకు చెప్పడం జరిగింది. తనే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుండడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. అయితే పాతిక శాతం షూట్ అయిన తరువాత విజయీభవ ఆర్ట్స్ వారు వచ్చి అప్పటివరకు తీసిన కంటెంట్ నచ్చి విరాట్ మీద నమ్మకంతో ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. విరాట్ నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజ్ విరాట్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి కూడా పాల్గొన్నారు.