బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమాలో కూడా రణవీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో ప్లే చేసి అట్రాక్ట్ చేశాడు. రణవీర్ సింగ్ ఎనర్జీకి, రోహిత్ శెట్టి స్టైల్ ఆఫ్ మేకింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందంటూ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ హీరో అండ్ డైరెక్టర్ నుంచి వచ్చే రెండో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే రణవీర్ సింగ్ అండ్ రోహిత్ శెట్టిలు కలిసి ‘సర్కస్’ సినిమా చేస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ‘సర్కస్’ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 23న మీ ఫ్యామిలీ నవ్వించడానికి వస్తున్నాం అంటూ మేకర్స్ ‘సర్కస్’ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సంధర్భంగా సర్కస్ సినిమాలో నటిస్తున్న నటీనటుల ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. రోహిత్ శెట్టి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సర్కస్ మూవీలో రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ ప్లే చేసిన రణవీర్ సింగ్, డ్యూయల్ రోల్ లో కనిపించడం ఇదే మొదటిసారి. మరి రెండు పాత్రల్లో రణవీర్ సింగ్ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే డిసెంబర్ 23 వరకూ ఆగాల్సిందే.