Ranga Ranga Vaibhavamga Trailer: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం రంగరంగ వైభవంగా. గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఉంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. బావమరదళ్ల మధ్య జరిగిన ఒక క్యూట్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. చిన్నతనంలో ఒక విషయమై గొడవపడి విడిపోయిన హీరో హీరోయిన్లు.. అదే ఈగోతో పెరిగిపెద్దవారవుతారు. ఇక వారిమధ్య ఉండే గొడవలను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది.
ఇక ఒకానొక దశలో ఈ బావామరదళ్ల మధ్య ప్రేమ మొదలవుతోంది. అప్పుడే వీరి మధ్య దూరం పెరుగుతోంది. ఆ గొడవలను హీరో ఎలా సాల్వ్ చేశాడు. అసలు మరదలితో, బావకు ఉన్న గొడవ ఏంటి..? చివరికి ఈ జంట ఈగోలను వదిలి కలిశారా..? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఇందులో వైష్ణవ్, కేతిక డాక్టర్స్ గా కనిపించారు. ముఖ్యంగా వీరి మధ్య రొమాన్స్ చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఇక వైష్ణవ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇక ట్రైలర్ ట్రైలర్ చివర్లో `నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క..ఇప్పటి నుంచి ఇంకో లెక్క” అంటూ వైష్ణవ్ చెప్పిన డైలాగ్ తన కెరీర్ కు అన్వయించుకోవచ్చు. ఉప్పెన తరువాత అలాంటి లవ్ స్టోరీనే ఎంచుకొని విజయాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు కనిపించాడు. ఇక సినిమా పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఉప్పెన హిట్ ను తిరగరాస్తాడో లేదో చూడాలి.