పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన, కొండపొలం’ చిత్రాల తర్వాత నటిస్తున్న మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’! కేతిక శర్మ నాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో గిరీశాయ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కి, టైటిల్‌కి వచ్చిన పాజిటివ్ వైబ్స్ మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తోందని చిత్ర సమర్పకుడు బాపినీడు చెప్పారు.
దేవిశ్రీ ప్రసాద్ బాణీ అందించిన పాటకు మంచి స్పందన వస్తోందని, ఇటీవల విడుదలైన ”తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవుతారో” అంటూ సాగే పాటకు ట్రెమండస్ అప్లాజ్ వచ్చిందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయినట్టు దర్శకుడు గిరీశాయ తెలిపాడు. ఈ చిత్రాన్ని మే 27న విడుదల చేయబోతున్నట్టు ఆ మధ్య నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు. కానీ అదే రోజున వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’తో పాటు అడివి శేష్ ‘మేజర్’, కంగనా రనౌత్ ‘ధాకడ్’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో… ‘ఎఫ్ 3’ కోసమైనా ‘రంగ రంగ వైభవంగా’ కాస్తంత వెనక్కి వెళ్ళొచ్చని తెలుస్తోంది.