రానా, వెంకటేష్ కలిసి నటించిన బోల్డ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ . 2023 మార్చిలో విడుదలైన ఈ సిరీస్ భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది. కానీ విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. ఎందుకంటే మొత్తం బూతులు మాటలు బోల్డ్ సీన్స్ తో నింపేశారు, అందులోను వెంకీ లాంటి ఫ్యామిలీ హీరో నుంచి ఇలాంటివి ఆశించలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా వెంకటేష్ వల్గర్ గా మాట్లడటం కూడా ఫ్యాన్స్ ని బాగా హట్ చేశాయి.ఈ నేపథ్యంలో ‘రానా నాయుడు 2’ కూడా రాబోతుందని తెలిసిందే. అయితే మొదటి సిరీస్ వచ్చిన టాక్ ని దృష్టిలో పెట్టుకుని వెంకటేష్ రెండో సీజన్ లో డోస్ తగ్గించేలా జాగ్రత్తలు తీసుకున్నామని ఇటీవలి ప్రెస్ మీట్‌లో తెలిపగా.. తాజాగా ‘రానా నాయుడు2’ కి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
కాగా రానా మరో పోరాటానికి సిద్ధమైనట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.టీజర్ ప్రారంభమవగా పెద్దగా ఆసక్తికర సన్నివేశాలు లేకున్నా.. తండ్రీకొడుకుల పాత్రలో కనిపిస్తున్న వెంకీ, రానా మధ్య పోరాటం ప్రధానంగా ‘సీజన్ 2’ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈ ప్రపంచంలో రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే’ అని వెంకటేశ్ వార్నింగ్ ఇస్తున్న సీన్ హైలెట్‌గా నిలిచింది. అయితే ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ చాలా ఏళ్ళ తర్వాత ఎంతో గొప్ప విజయం సాధించారు. థియేటర్లకు రావడం మానేసిన ఎందరో ప్రేక్షకులు ఈ సినిమా కోసం బయటికి కదిలారు.ఇక ఈ ఫేమ్ ‘రానా నాయుడు 2’కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ కనిపించబోయే ఫ్రెష్ రిలీజ్ ఇదే. కనుక ఆడియన్స్ చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఎలాగో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు తగ్గించామని హామీ ఇచ్చారు కనక చూడోచ్చు. ఇంకా సీజన్2 స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది లాక్ చేయలేదు. వేసవిలో రావొచ్చు.