టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కోలీవుడ్ స్టార్ సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో సూర్య “ఈటీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రానా మాట్లాడుతూ “ఒకప్పుడు నేను నటించిన ఒక సినిమా చూసిన సూర్య… నన్ను తన కారులో తీసుకెళ్లి 4 గంటల పాటు హైదరాబాద్ మొత్తం తిప్పుతూ నువ్వు చేస్తోంది యాక్టింగ్ కాదురా ఇంకేదో అంటూ క్లాస్ పీకాడు. ఆ తరువాత మీ ముందుకు భళ్లాలదేవుడు వంటి నటుడు వచ్చాడు” అంటూ ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నారు.
Read Also : ET Movie Pre Release Event : చిరంజీవి ఇన్స్పిరేషన్ తోనే సూర్య అలా…!
ఇక ‘ఈటీ చిత్రబృందానికి కూడా విషెస్ తెలియజేశారు. అంతేకాదు తనకు మరోవ్యక్తి సత్యరాజ్ కూడా ఈ సినిమాలో ఉన్నాడంటూ ‘బాహుబలి’ రోజులను గుర్తు చేసుకున్నాడు. కాగా సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన “ఈటీ” మార్చి 11న రిలీజ్ కు రెడీగా ఉంది. ఇందులో సూర్యకు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది.