Rana Daggubati: యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. రానా గురించి చెప్పాలంటే.. ఎలాంటి విషయాన్ని అయినా ఎలాంటి వివాదంపైన మీడియా ముందు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తన మనసుకి ఏది అనిపిస్తే దాన్ని చెప్పేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు రానా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాలలో ఇరుక్కున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే అందులో కూడా నిజం లేకపోలేదు అనేది చాలామంది వాదన. ఇకపోతే ప్రస్తుతం రానా జాతీయ అవార్డుల విషయంలో ఒక సినిమాకు అన్యాయం జరిగిందని చెప్పకనే చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కోలీవుడ్ సినిమా జై భీమ్ కు అవార్డు రాకపోవడంపై అవమానులు ఎంతటి అసహనాన్ని వ్యక్తం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో అద్భుతమైన సినిమాకు అవార్డు రాకపోవడంతో తామందరం నిరాశ చెందామని చెప్పుకొచ్చారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖులు సైతం ఈ సినిమా విషయంలో బాధపడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముఖ్యంగా హీరో నాని జై భీమ్ కు అవార్డు రాకపోవడంతో తన మనసు ముక్కలవుతున్నట్టు ఎమోజీ పెట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అప్పట్లో నాని ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన విషయం కూడా తెలిసిందే.
SS Rajamouli: రాజమౌళి జాతకంలో బ్యాడ్ లక్.. మహేష్ సినిమా ఇప్పట్లో కష్టమే..?
ఇక తాజాగా ఈ వివాదంపై రానా.. సైమా అవార్డుల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో స్పందించాడు. సినిమాల విషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవని, నటీనటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని చెప్పుకొచ్చాడు. “కొంతమందికి ఒక సినిమా నచ్చుతుంది.. కొంతమందికి అదే సినిమా నచ్చకపోవచ్చు.. నటుల అభిరుచులు కూడా అలాగే ఉంటాయి. అంత ఎందుకు ఈ మధ్య జై భీమ్ కు జాతీయ అవార్డు వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ, అది ఎంపిక కాలేదు. దీంతో చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంలో కొంతమంది కాంట్రవర్సీ చేశారు.. ఇంకొంతమంది కేవలం ట్వీట్ మాత్రమే చేశారు. కాంట్రవర్సీ చేసే వాళ్ళు కాంట్రవర్సీ చేశారు. నార్మల్ ట్వీట్ వేసేవాళ్ళు నార్మల్ ట్వీట్ వేశారు” అని రానా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.