Rana Daggubati: ఆ పని రవితేజ చేస్తే తప్పు లేదు.. రానా చేస్తే తప్పా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒక పక్క నిర్మాతగా మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తూనే మరోపక్క మంచి కథలతో హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రానా, బాబాయ్ వెంకటేష్ తో కలిసి రఫ్ఫాడించడానికి రానా నాయుడు తో వచ్చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ కోసం బాబాయ్- అబ్బాయ్ ఒక్కటైన విషయం విదితమే. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనోవన్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించాడు. ఇక శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్. రానా తన ఒరిజినల్ నేమ్ తో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. వెంకీ మునుపెప్ప్పుడు చూడని కొత్త లుక్ తో కనిపించాడు. ఇక టీజర్ ఉత్కంఠభరితంగా సాగింది.
ఇక టీజర్ చూసాకా అందరి చూపు రానా లిప్ లాక్ దగ్గరే ఆగిపోయింది. హీరోయిన్ తో ఘాటు పెదవముద్దుతో రెచ్చిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఏంటీ .. రానా పెళ్లి తరువాత కూడా ప్లే బాయ్ లా మారితే ఎలా..? అని కొందరు.. భార్య మీహిక పర్మిషన్ తీసుకున్నావా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇలాంటి కామెంట్స్ పెట్టినవారికి రానా అభిమానులు, మరికొందరు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పెళ్లి తరువాత ఏ హీరో ముద్దు పెట్టకుండా ఉంటున్నాడు.. ప్రతి సినిమాలో రవితేజ, కుర్ర హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేయడం లేదా..? ఆయనతో పోలిస్తే రానా వయస్సు ఎంత..? అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఘాటు చుంబనం రవితేజ చేస్తే తప్పు లేదు.. రానా చేస్తే ఇలా అడిగేస్తారా..? అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా, హీరో ఎవరైనా.. కథ డిమాండ్ చేస్తేనే ఏ సీన్ అయినా చేస్తారు కానీ, అనవసరమైన ముద్దుల కోసం స్టార్స్ ఎప్పుడు హంగామా చేయరని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సిరీస్ బాబాయ్- అబ్బాయ్ లకు ఎలా కలిసొస్తుందో చూడాలి.
Also Read
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!