Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. బోల్డ్ గా మాట్లాడంలో వర్మ తరువాతే ఎవరైనా. శృంగారం గురించి నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు. ఇక తాజాగా వర్మ దర్శకత్వం వహించిన డేంజరస్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసిన వర్మ.. మరో డేంజరస్ లేడీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూ నేడు రిలీజ్ అయ్యింది. అషు అందాల ఆరబోత ఒకపక్క, వర్మ బోల్డ్ మాటలు మరోపక్క.. ఇంటర్వ్యూ మొత్తం శృంగారానికి సంబంధించిన మాటలతో వేడెక్కించారు. ముఖ్యంగా అషు నిర్మొహమాటంగా వర్మను.. నువ్వు ఎంతమందితో శృంగారం చేసావ్.. వారిలో ఎవరు బాగా నచ్చారు అని అడగడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక దానికి వర్మ సమాధానం చెప్తూ ” శృంగారం గురించి అసలు నేను చెప్పను కానీ, నువ్వు అడుగుతున్నావని చెప్తున్నాను.. నేను ఇప్పటివరకు 400 మందితో శృంగారం చేశాను.. అందులో నాకు నచ్చినవారు అని చెప్పడం కష్టం. ఒక్కోసారి నచ్చినవారితో రోజుకు పదిసార్లు చేశాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ సమాధానం విన్న అషు వర్మను చూసి నేర్చుకోవాలి అని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు.. అషును తిట్టిపోస్తున్నారు. మీ ఇంట్లోవాళ్ళు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎలా ఫీల్ అవుతారో అన్న సెన్స్ కూడా లేదా అంటుంటుండగా.. మరికొందరు.. వర్మలా బతకాలి రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.