Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. ఇది కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల విశ్వాసంతో ముడిపడిన మహా ఇతిహాసం కూడా. అందుకే న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన ‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమం ఒక ట్రైలర్ ప్రివ్యూ ఈవెంట్‌గా కాకుండా, భక్తి, బాధ్యత, కృతజ్ఞత కలిసిన ప్రత్యేక వేడుకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి, రణబీర్ కపూర్, యష్ తమ అనుభవాలను పంచుకున్న తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ వేడుకలో హృదయాలను హత్తుకున్న క్షణాల్లో ఒకటి సీతామాత పాత్రపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు. ఈ పాత్రను తాను సాధించలేదని, ఆ పాత్రే తనను ఎంచుకుందని ఆమె భావోద్వేగంగా చెప్పారు. సీత పాత్రను కేవలం నటనగా కాకుండా ఒక దైవిక బాధ్యతగా స్వీకరించానని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ప్రతి సన్నివేశం సహజంగా రావాలని, ప్రతి హావభావంలో సీతమ్మ తత్వం ప్రతిబింబించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించేదానినని వెల్లడించారు. తన ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా ప్రయత్నించానని, ఈ ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా తన జీవితాన్నే మార్చేసిందని సాయి పల్లవి అన్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన పాత్రల్లో ఒకటిని పోషించే అవకాశం తనకు దక్కడం జీవితాంతం గుర్తుండిపోయే వరమని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ఆ తర్వాత వేదికపై మాట్లాడిన రణబీర్ కపూర్ తన వినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, కంటి ఇన్ఫెక్షన్ కారణంగా సన్ గ్లాసెస్ ధరించాల్సి వచ్చిందని ముందుగా క్షమాపణ చెప్పారు. అనంతరం తన దృష్టిని సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ వైపు మళ్లించారు. టెలివిజన్‌లో శ్రీరాముడి పాత్రతో కోట్లాది భారతీయుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్‌ను ఉద్దేశించి, ఆయన సృష్టించిన ఆ దైవిక రూపానికి కనీసం ఒక శాతం న్యాయం చేయగలిగినా తన నట జీవితంలో అది గొప్ప విజయంగా భావిస్తానని అన్నారు. శ్రీరాముడి పాత్రను పోషించడం ఎంతటి బాధ్యతో తనకు పూర్తిగా తెలుసని, ఆ పాత్ర పట్ల అపారమైన గౌరవంతో పనిచేశానని తెలిపారు.
రావణుడి పాత్రలో నటిస్తున్న యష్ కూడా ఈ కార్యక్రమంలో ఈ సినిమా విశిష్టతను వివరించారు. రామాయణం కేవలం ఒక సినిమా కాదని, భారతదేశపు సంస్కృతి, ఆధ్యాత్మికత, విలువలను ప్రపంచానికి పరిచయం చేసే మహత్తర ప్రయత్నమని చెప్పారు. ఈ స్థాయి ప్రాజెక్ట్‌ను ఆలోచించి అమలు చేయాలనే ధైర్యం నిర్మాత నమిత్ మల్హోత్రాకే సాధ్యమైందని ప్రశంసించారు. దర్శకుడు నితేష్ తివారీ తన పాత్రలోని ప్రతి కోణాన్ని అర్థం చేసుకునేలా ఎంతో సహాయం చేశారని పేర్కొన్నారు. అలాగే శ్రీరాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ చూపించిన అంకితభావాన్ని, సీతగా సాయి పల్లవి కనబరిచిన నిజాయితీని ప్రత్యేకంగా కొనియాడారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. జూలై 24న గ్లోబల్ వైడ్‌గా విడుదల కానున్న ట్రైలర్ మరింత కనుల పండుగలా జరగబోతోంది.
- Tags
- cinema
- Ramayana
- Sai Pallavi
తాజావార్తలు
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!