Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘రామాయణం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పౌరాణిక సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో గణేష్ చతుర్థి సందర్భంగా మేకర్స్ ప్రేక్షకులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. గణేష్ చతుర్థి సందర్భంగా ‘రామాయణం’ మేకర్స్ సీతా, రామ్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపిస్తున్నారు. వనవాస సమయంలో సీతారాములు ప్రశాంతమైన ప్రకృతి మధ్య గడుపుతున్న సందర్భాన్ని గుర్తు చేసేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు. ఒక జలపాతం సమీపంలోని అడవిలో బండరాయిపై ఇద్దరూ కూర్చుని కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రణబీర్.. సాయి పల్లవికి పూలతో అలంకరిస్తున్నట్టుగా కనిపించే ఈ ఫ్రేమ్‌లో ఇద్దరి లుక్ చాలా ప్రశాంతంగా, దివ్యంగా ఉంది.
పోస్టర్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో సాయి పల్లవి లుక్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీత పాత్రకు ఆమె చాలా బాగుందని, రణబీర్, సాయి పల్లవి జోడీ తెరపై చూడటానికి ఎంతో అందంగా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సినిమా కథలోని భావోద్వేగాలను ఈ ఒక్క పోస్టర్లోనే చూపించే ప్రయత్నం చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ‘రామాయణం’ను నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా, నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్‌తో పాటు హాన్స్ జిమ్మర్ సంగీతంలో భాగస్వామ్యం కావడం కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. భారీ విజువల్ స్కేల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళి సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్‌లకు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు సీతారాములుగా రణబీర్, సాయి పల్లవి కనిపించిన ఈ కొత్త పోస్టర్ ఆ అంచనాలు మరింత పెరిగాయి.
Also Read
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
తాజావార్తలు
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!