Site icon NTV Telugu

Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత

Ramayana

Ramayana

ఇండియన్ సినిమాటిక్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పెద్ద అంచనాలతో ఉంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ రెండు భాగాల పౌరాణిక ఇతిహాసంలో రాణ్‌బీర్ కపూర్ రాముడు, సాయి పల్లవి సీత, యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమాన్, అమితాబ్ బచ్చన్ జటాయువు, రవి దూబే లక్ష్మణుడి పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం హాన్స్ జిమ్మెర్, ఎ.ఆర్. రెహమాన్ సమకూర్చుతున్నారు. స్టార్ కాస్టింగ్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే తాజాగా, నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read : Mana Shankara Varaprasad: గ్లింప్స్‌లో చిరు డూప్ అంటు కామెంట్స్.. క్లారిటి ఇచ్చిన అనిల్ రావిపూడి

“మేము ‘రామాయణ ని కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి చేరువ అయ్యేలా రూపొందిస్తున్నాం. అయితే పాశ్చాత్య ప్రేక్షకులకు ఇది నచ్చకపోతే, అది నా ఫైల్యూర్‌ గా భావిస్తా. దర్శకుడు నితేష్ తివారీ కూడా భావోద్వేగాలను స్పష్టంగా ఫీల్ అయ్యేలా సినిమాను రూపొందిస్తున్నారు’ అని తెలిపానే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ ఇతిహాసానికి కనెక్ట్ అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ‘రామాయణ’ సినిమా వచ్చే ఏడాది దీపావళి‌కి మొదటి భాగం విడుదల కానుంది, మరుసటి ఏడాది రెండో భాగం రిలీజ్ అవుతుంది.

Exit mobile version