Simran: అందాల నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి, ఇప్పటికీ ఆమె నాజూకైన శరీరంతో కుర్రకారును ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉంది. చిరంజీవి నుంచి మెహెష్ బాబు వరకు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఏకైక హీరోయిన్ అంటే సిమ్రాన్ అనే చెప్పాలి. అందాల ఆరబోతకు అయినా, డ్యాన్స్ లకు అయినా, ప్రయోగాలకు అయినా అప్పట్లో సిమ్రాన్ పేరే ముందు వరుసలో ఉండేది. ఇక రీ ఎంట్రీలో మాత్రం ఏమైనా తక్కువా..? అందరిలా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా, అత్తగా కాకుండా విలన్ గా, ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సిమ్రాన్.. దీపక్ భగ్గాను వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. అదీప్ భగ్గా, అదిత్ భగ్గా. సోషల్ మీడియాలో సిమ్రాన్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం తన ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది.
Sai Dharam Tej: సాయి పల్లవి.. సమంత.. ఇప్పుడు తేజ్.. దేనికోసం ఇది
ఇక తాజాగా సిమ్రాన్ పెద్ద కొడుకు అదీప్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అచ్చు గుద్దినట్లు పోలికల్లో అమ్మను దింపేశాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి వయస్సు 17. ఇంటర్ చదువుతున్నాడు. అయితే అదీప్ లుక్ మాత్రం హీరోలా ఉండడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. సిమ్రాన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? అని నోళ్లు నొక్కుకుంటున్నారు. ప్రస్తుతం అదీప్ దృష్టి మొత్తం చదువు మీదనే పెట్టాడట. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగాహీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇక సిమ్రాన్ సైతం తన పిల్లలు ఎలాంటి రంగంలో స్థిరపడాలి అనుకొంటే ఆ రంగంలోనే సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి వచ్చే మూడేళ్లో ఈ కుర్రాడిని హీరోగా చూడోచ్చేమో అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.