Ram Pothineni : ఆంధ్రా కింగ్ కోసం రామ్ కొత్త ప్రయోగం.. ఇది కూడా భాగ్యశ్రీ కోసమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్’ . ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ కొట్టిన రామ్, ఆ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్, ది వారియర్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోవడంతో కాస్త వెనుకబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి రావాలని రామ్ ప్రయత్నిస్తున్న ప్రాజెక్ట్ ఇదే. అయితే ఈ సినిమా కోసం రామ్ ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయోగం చేశాడు. అదేంటంటే.. ఆయన స్వయంగా ఒక పాట రాశాడు. లిరిక్స్ కూడా అద్భుతంగా రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పాట వెనుక నిజమైన కారణం మరోదేనని టాక్ వస్తోంది. రామ్ తన కో-స్టార్ భాగ్యశ్రీ బోర్సే కోసం ఈ పాట రాశారనే రూమర్స్ ఫిల్మ్ నగరంలో గుసగుసలుగా వినిపిస్తున్నాయి.
Also Read : Ravi Teja : 2 నెలల్లో డబుల్ ట్రీట్ కి సిద్ధమవుతున్న రవితేజ?
Also Read
సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి రామ్–భాగ్యశ్రీల మధ్య ఏదో ఉందని టాక్ నడుస్తూనే ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు కూడా చాలా సారూప్యంగా ఉండటంతో ఫ్యాన్స్‌లో డౌట్స్ పెరిగాయి. అందుకే “భాగ్యశ్రీ కోసం రాసిన పాటే ఇది.. ప్రేమలో ఉన్నవారే ఇలాంటివి రాయగలరు” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో వార్త హల్‌చల్ చేస్తోంది. రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ కోసం కేవలం పాట రాయడమే కాకుండా, తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ స్వయంగా ఓ పాట కూడా పాడబోతున్నాడట. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా, ఒక్కసారైనా మైక్ పట్టని రామ్, ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నాడో అన్న అనుమానం ఫ్యాన్స్‌లో ఉంది. “ఇంతవరకూ పాట పాడని రామ్, ఇప్పుడు ఒక్కసారిగా పాడాలని నిర్ణయించుకోవడమేంటి? ఇది కూడా భాగ్యశ్రీ కోసమేనా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ఊహాగానాలన్నింటికీ రామ్ ఎలాంటి స్పందన ఇస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!