కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శహకత్వంలో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ది వారియర్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మరో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఇక ఈ వేడుకలో రామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యాన్స్ తనపై చూపించిన అభిమానానికి ఎప్పటికి ఋణపడి ఉంటానని కంటనీరు పెట్టుకున్నారు. “ఈ సినిమా జర్నీని చాలా డిఫరెంట్ గా మొదలైంది. ఒక పోలీస్ కథ చేద్దామని అనుకున్నాను.. అలాగే కథలు వింటున్నాను.. ఒకటి, రెండు, మూడు కథలు వింటున్నాను. అన్ని కథలు ఒకేలా అనిపించాయి. ఒక సమయంలో అసలు పోలీస్ కథలు ఆపేద్దాం అనుకుంటున్న సమయంలో లింగుసామి కథ ఉంది అని నా దగ్గరకు వచ్చారు. ఆయనకు కథ అని చెప్పారు కానీ పోలీస్ కథ అని చెప్పలేదు.
ఇక పోలీస్ కథ అని చెప్పగానే.. అరే ఇప్పుడే వద్దు అనుకున్నాను కదా అనుకుంటూనే విన్నాను. విన్న తరువాత అసలు పోలీస్ కథ చేస్తే ఇలాంటిదే చేయాలనిపించింది. ఈ కథ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సత్య లాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు.. నాకు నేర్చుకోవాలనిపించింది. ఎందుకంటే .. జీవితంలో మన కంట్రోల్ లో ఉన్న పనులు మనం చేస్తాం.. మన కంట్రోల్ లో లేనివి దేవుడికి వదిలేస్తాం.. కానీ మన కంట్రోల్ లో లేవనుకొని కొన్ని వదిలేస్తాం.. అసలు లైఫ్ లో ఒకటి సాధించాలంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు అనిపించింది వీరందరి స్టోరీస్ విన్నాకా.. వాళ్ళ స్టోరీస్ అన్ని కలిపితే సత్య స్టోరీ వచ్చింది. లింగుసామి సర్ హ్యాట్సప్ ఇలాంటి కథ రాసినందుకు
ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్.. ప్రతి సినిమాకు అందరు చెప్తూ ఉంటారు.. కానీ ఈ సినిమా చేసే సమయంలో నేను ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాను. షూటింగ్ కు నెలరోజులు టైం ఉందని పోలీస్ క్యారెక్టర్ కు రెడీ అవడానికి రోజుకు రెండు పూటలా వర్క్ అవుట్స్ చేసేవాడిని. ఆ సమయంలోనే లైట్ గా ఇంజ్యూరీ అయ్యింది.. స్పైనల్ కార్ట్ దగ్గర.. మూడు నెలలు అయ్యింది ఆ నొప్పి ఇంకా తగ్గలేదు.. ఇక డాక్టర్స్ ను అడిగాను.. జిమ్ చేయాలి.. వెయిట్స్ ఎత్తాలి అని.. వన్ కేజీ కన్నా ఎక్కువ లేపొద్దు అని చెప్పారు. ఈ వన్ కిలో వర్క్ అవుట్లు మనకు వర్క్ అవుట్ అవ్వవు.. అక్కడేమో బుల్లెట్ లు, విజిల్స్ అంటున్నారు అంటే.. ఆయనొక ప్రశ్న వేశారు.. ఏమండీ మీకు సినిమా ముఖ్యమా..? జీవితం ముఖ్యమా అని.. అంటే సినిమానే లైఫ్ అనుకునేవారికి ఔట్ అఫ్ సిలబస్ అనిపిస్తోంది.. చాలారోజుల తరువాత ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఫ్యాన్స్ పంపించిన మెసెజ్ లు చూశాను. ఆ ప్రెషర్ అంతా సాంగ్స్ ఉన్నాయి.. ఫైట్స్ ఉన్నాయి.. అవి, ఇవి చేయాలి అనిపిస్తుంది. కానీ వాళ్లు .. అన్నా నువ్వేమి చేయొద్దు.. ఈ సినిమా నుంచి మేమేమి ఆశించడంలేదు అని ఉన్నాయి.. అప్పుడు అనిపించింది ఇది అన్ కండిషనర్ లవ్ అని.. అప్పుడే నాకు వైజాగ్ లో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మీరా.. నేనా అన్నరోజు.. ఆరోజు నాకు అర్ధమయ్యింది మీరు లేకపోతే నేను లేను అని.. అంత నొప్పి భరిస్తూ నేను డాన్స్ చేశాను అంటే అది మీరు నాకు ఇచ్చిన ఎనర్జీ. థాంక్యూ సో మచ్.. ఈ సినిమా నాకు ఎంతో నేర్పింది. స్క్రీన్ మీద చూస్తున్నా నాకేమి గుర్తులేదు మీరే గుర్తొచ్చారు. వారియర్ జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతపురం నుంచి వచ్చిన వారికీ దెబ్బలు తగిలాయని విన్నాను. జాగ్రత్త.. మీకు నేను ఎంతో .. మీరుకూడా నాకు అంతే అన్న విషయాన్నీ మైండ్ లో పెట్టుకోండి.. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి” అంటూ ఎమోషనల్ అయ్యారు.